Saturday, June 29, 2024

బీహార్‌లో కూలిన మరో వంతెన

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లో మరో వంతెన కుప్పకూలింది. వారంలో ఇది రెండో ఘటన. ఇటీవల నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలింది. ఇప్పుడు బీహార్‌లోని సివాన్ జిల్లాలో గల గండక్ కాలువపై ఉన్న వంతెన కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. మహారాజ్‌గంజ్ జిల్లాలోని పటేధి బజార్ మార్కెట్‌ను,  దర్భంగాలోని రామ్‌గఢ్ పంచాయతీని ఈ వంతెన కలుపుతుంది. శనివారం ఉదయం ఈ వంతెన ఒక్కసారిగా భారీ శబ్దంతో కూలింది.

ఈ వంతెనపై నుంచి ప్రతిరోజు వందలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. నిర్వాహణ లోపం వల్లే వంతెన కూలిపోయిందని,  ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వంతెన దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించింది. ఈ వంతెన కూలిపోవడంతో గండక్ కాలువ మీదుగా రాకపోకలు స్తంభించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News