Wednesday, January 22, 2025

మహిళ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : ఆర్థిక లావాదేవీలు ఒక మహిళ ప్రాణాలు బలికొన్నాయి. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ భగత్‌నగర్‌లోని క్రిస్టల్ ప్లాజా అపార్టుమెంట్‌లో వివాహిత గుండా సరిత (35) దారుణ హత్యకు గురైంది. గోదావరిఖని 8 ఇంక్లెన్‌కాలనీకి చెందిన ఆకుల ఓదెలు – లక్ష్మీల రెండవ కుమార్తె సరిత ఆదిలాబాద్ జిల్లా జన్నారం దేవునిగూడెంకు చెందిన గుండా శ్రీపాల్‌రెడ్డిలు 2001లో ప్రేమ వివాహం చేసుకుని గోదావరిఖనిలో నివాసం ఉంటున్నారు.

వీరికి ఆస్మిత్‌రెడ్డి, మణిత్ ఆస్మిత్‌రెడ్డిలు ఇద్దరు కుమారులు ఉన్నారు. గోదావరిఖనిలో సదరు మృతురాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేది. ఆ విషయం శ్రీపాల్‌రెడ్డికి నచ్చకపోవడంతో వారి ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరగడంతో గతేడాది నుండి భర్తకు దూరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పనిమీద అప్పుడప్పుడు కరీంనగర్‌కు వస్తుండేది. ఈ క్రమంలో భగత్‌నగర్‌లోని క్రిస్టల్ అపార్టుమెంట్ 203 ప్లాట్‌లో నివాసం ఉంటున్న వెంకటేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా, ఇద్దరు కరీంనగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సరిత తమ్ముడు ఆకుల సతీష్ నగరంలోని రాంనగర్ నివాసం ఉంటున్నారు.

వేసవి సెలవులు ఉండటంతో కొడుకులతో సహా సరితచ తమ్ముడి ఇంట్లోనే ఉంది. ఈ నెల 28న కొడుకులను గోదావరిఖని పంపించి సాయంత్రం వెంకటేశ్‌తో కలిసి రియల్ ఎస్టేట్ పనులపై వరంగల్‌కు వెళుతున్నానని సతీష్‌కు చెప్పింది. ఈ నెల 29న ఫోన్ చేయగా సరిత ఫోన్ స్వీచ్చాఫ్‌లో ఉంది. శుక్రవారం వెంకటేశ్ సరిత ఫోన్ నుండి ఆకుల సతీష్‌కు వాట్సప్‌లో వాయిస్ కాల్ చేసి సరిత తల గొడకు కొట్టుకుందని తన అపార్టుమెంట్ తాళం పగలగొట్టి తీసుకెళ్లమని సూచించాడు.

వెంటనే సరిత సోదరి స్వాతి, తమ్ముడు సతీష్‌లు కలిసి అపార్టుమెంట్‌కు వెళ్లారు. తాళాన్ని పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా రక్తపు గాయాలతో ఉండి ముఖం, తలపై తీవ్ర గాయాలతో పాటు ఆమె మెడకు చున్నీ బిగించి మృతిచెంది ఉంది. వెంటనే పోలీసులకు సమాచారమందించడంతో సీఐ రవికుమార్, సిబ్బంది, క్లూస్‌టీంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పలు ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
* ఆర్థిక లావాదేవీలే కారణమా…?
సరిత మృతికి వ్యాపార లావాదేవిలే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే క్రమంలో దాదాపు 25 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు వెంకటేష్‌కు అప్పగించగా అతనిని పలుమార్లు తనకు రావాల్సిన డబ్బులు అడిగిన ఇవ్వకపోయే సరికి వారి ఇద్దరికి గొడవలు జరిగేవని సరిత తమ్ముడు సతీష్ తెలిపాడు.

సరిత మృతికి రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే కోణంలో వెంకటేశ్ అపార్టుమెంట్ సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నారు. పోలీసు ప్రత్యేక బృందాలు హంతకుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి. భగత్‌నగర్‌లోని అపార్టుమెంట్‌లో హత్య జరగడంతో అపార్టుమెంట్ వాసులందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News