Saturday, December 21, 2024

యువకుడి దారుణ హత్య!

- Advertisement -
- Advertisement -

దేవరకొండ: గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో యువకుడు దా రుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం దేవరకొండ పట్టణంలో వె లుగు చూసింది. దేవరకొండ పట్టణం పాతరామాలయం వీధికి చెందిన పులిజాల చంద్రమోళి..జయమ్మ దంపతుల ఏకైక కుమారుడు పులిజాల రఘురాములు(36) వృత్తిరీత్యా దేవరకొండ పట్టణంలోని సబ్‌రిజిస్టార్ కార్యాలయం వద్ద స్టాంప్ వెండర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దీనికితోడు పట్టణంలోని విష్ణు కాంప్లెక్స్‌లో గల సెంట్రల్ కిడ్స్ వేర్‌ను భార్య లక్ష్మి నిర్వహిస్తుంది. రఘురాములు సోమవారం సాయంత్రం డ్యూటీ ముగి ంచుకొని భార్యను షా పు వద్ద నుండి బైక్‌పై తీసుకొని ఇంటి వద్ద దింపి ఇప్పుడే వస్తాననిచెప్పి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి పది దాటుతున్నా ఎంతకూ ఇం టికి రాకపోవడంతో ఫోన్‌చేసినా స్పందించలేదు. దీంతో ఫ్రెండ్స్‌కు, కుటుంబ సభ్యులను ఆరాతీశారు.
మిషన్ కంపౌడ్ సమీపంలో శవమై
ఇదిలా ఉండగా సోమవారం రాత్రి ఇంట్లో నుంచి బయలుదేరిన రఘురాము లు మంగళవారం ఉదయం దేవరకొండ పట్టణంలోని మిషన్ కంపౌండ్ సమీపంలో శేరిపల్లి రోడ్‌లో పక్కన శవమై కన్పించాడు. అటుగా వాకింగ్‌కు వెళ్లిన వారు చూసి విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి ట్రైనీ ఐపిఎస్ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సిఐ పరుశురాం, ఎస్సై సతీష్ చేరుకొని పరిశీలించారు. నల్గొండ నుంచి క్లూస్‌టీం, డాగ్‌స్కాడ్ బృందాలను రప్పించి పరిశీలించారు. డాగ్‌స్కాడ్ సంఘటనాస్థలం నుండి పట్టణంలోని తుల్చమ్మకుంట వద్దకు వెళ్లి తిరిగి అదేదారిలో సంఘటనాస్థలానికి చేరుకుంది.

క్లూస్‌టీం ఆదారాల కోసం షాంపీల్స్‌ను సేకరించారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన కుమారుని కొట్టి చంపిన వారిని గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మృతుని తండ్రి చంద్రమోళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News