Sunday, December 22, 2024

విద్యారంగంపై అబద్దాలతో కూడిన బడ్జెట్

- Advertisement -
- Advertisement -

కేంద్ర ఆర్థిక మంత్రి వాస్తవాలు దాచిపెట్టారు : ఎస్‌ఎఫ్‌ఐ

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ఓటాన్ బడ్జెట్ ప్రవేశ పెడుతూ బడ్జెట్ సమావేశాల్లో దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వాస్తవాలకు బహు దూరంగా మాట్లాడారని ఎస్‌ఎస్‌ఐ రాష్ట్ర కమిటీ మండిపడింది. గురువారం ఆ సంఘం నాయకులు ఆర్.ఎల్.మూర్తి, నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొంటూ ఉన్నత విద్యారంగంలో 28 శాతం విద్యార్థినుల ఎన్రోల్ మెంట్ పెరిగిందనడం, సైన్స్, టెక్నాలజీ ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో విద్యార్థినుల చేరిక 43 శాతంగా ఉందని ప్రపంచంలోనే ఇది అత్యుత్తమమైనది అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బిజెపి అధికారం చేపట్టాక విద్యార్థినులు చదువులకు దూరమయ్యారని, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, కేంద్రీయ పాఠశాలల్లో, నవోదయల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. స్కిల్ ఇండియా ఏర్పాటు చేసి ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది యువతను స్కిల్ యువతగా తీర్చిదిద్దామనని తెలిపారని, ఎన్ని లక్షల యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారో సమాధానం చెప్పాలన్నారు.

నూతన ఐటిఐలు, ఐఐటీలు, మెడికల్ కళాశాలలు, ఐఐఎంలు ఏర్పాటు చేసినట్లు గొప్పలు చెప్పారని, ఆయా కళాశాలలో మౌలిక సదుపాయాల కొరత విద్యార్థులను తీవ్రంగా వేధిస్తోందన్నారు. ప్రభుత్వమే 390కి పైగా ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులిచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసిందన్నారు. ఏకలవ్య పాఠశాలలు, సైనిక స్కూల్స్ తదితరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పిన దేశంలో… నూతన విద్యాసంస్థలు ఎక్కడ ప్రారంభం కాలేదన్నారు. నూతన విద్యావిధానంకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు.. విద్యారంగానికి లేవని, నూతన విద్యావిధానం పేరుతో విద్యారంగాన్ని ప్రైవేటు, కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే కుట్రలు చేస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో విద్యాప్రమాణాలు పెరగాలంటే బడ్జెట్ కేటాయింపులు పెరగాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News