Sunday, January 19, 2025

బస్సు, కారు ఢీ.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: బస్సు,కారు ఢీ కొని ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్‌కల్ మండలంలోని ప్రదాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. జహీరాబాద్ డిఎస్పి, రఘు, హదునూర్ ఎస్సై వినయ్‌కుమార్‌లు తెలిపిన వివరాల ప్రకారం… బీదర్ నుంచి బస్సు హైదరాబాద్ వస్తుండగా, హైదరాబాద్ నుంచి కారు బీదర్ వెళ్తున్న క్రమంలో ఎదురెదురుగా వస్తున్న బస్సుని ఢీ కోట్టడం వల్ల కారు నడుపుతున్న వ్యక్తి సింగిరెడ్డి శ్రీనివాస్(39)తండ్రి లచ్చయ్య మంచిర్యాలకు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. హుటహూటిన సంఘటన స్థలానికి చేరుకుని తీవ్రగాయాలైన వ్యక్త్తి బెంగుళూరు వెంకటేశ్వరరావును చికిత్స నిమిత్తం బీదర్ ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News