Sunday, January 19, 2025

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన బస్సు

- Advertisement -
- Advertisement -

కొండపాక : ద్విచక్రవాహనాన్ని ఆర్టిసి బస్సు ఢీ కొట్టింది .ఈ సంఘటన కుకునూరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న కిష్టాపూర్ సమీపంలో రాజీవ్ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో వృద్ధుడు మృతి చెందాడు. ఎస్‌ఐ పుష్‌పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం … కుకునూరుపల్లి గ్రామానికి చెందిన పర్వతం నర్సయ్య(70) అనే వృద్ధ్దుడు మోపెడ్‌పై వెలుతుండగా హైదరాబాద్ వైపు వెలుతున్న జనగామ డిపో బస్సు ఢీ కొట్టింది. దాంతో నర్సయ్య కిందపడి పోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృత దేహన్ని గజ్వేల్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News