Monday, December 23, 2024

నల్లమల ఘాట్ రోడ్డులో కారు దగ్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దైవ దర్శనానికి వెళ్లి వస్తున్నక్రమంలో ఓ కారు దగ్దమైన ఘటన శ్రీశైలం దోర్నాల నల్లమల ఘాట్ రోడ్డులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైజాగ్ కు చెందిన ఓ కుటుంబం మల్లన్న దర్శనార్ధమై శ్రీశైలం చేరుకున్నారు. మొక్కులు చెల్లించుకుని స్వంత ఊరుకు బయలుదేరారు.

Also read: అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లిన సిబిఐ బృందం…

తిరుగు ప్రయాణంలో తుమ్మల బైలు జంగిల్ సఫారీ బేస్ క్యాంప్ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారులో పెట్రోల్ లీకైంది. దీంతో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై వెంటనే కారు నుంచి బయటకు వచ్చారు. కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News