- Advertisement -
- ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీలుచ్చకున్న ప్రయాణికులు
సదాశివపేట రూరల్: ఎండల ధాటికి నడిరోడ్లపై వాహనాలు దగ్ధమైపోతున్నాయి. ఆదివారం సదాశివపేట మండల పరిధిలోని పెద్దాపూర్‌లోని ముంబాయి హైదరాబాద్ జాతీయ రహదారిపై అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు లేచి వాహనాన్ని కాలిబూడిద చేసింది. మునిపల్లికి చెందిన 7గురు వ్యక్తులు రెనాల్డ్ డస్టర్ కారులో 7మందితో కలిసి నర్సాపూర్‌కు పయనమయ్యారు. కారునడుస్తుండగానే మంటలు లేచాయి. కారును పక్కకు నిలిపి కారులోంచి దిగగానే అంతలోపే కారులో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. సదాశివపేట పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగానే హుటాహుటిన వచ్చి కారులోని మంటలను అదుపుచేశారు. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు ఎలాంటి ప్రాణపాయం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -