Monday, January 20, 2025

ఆటోని ఢీకొట్టిన కారు

- Advertisement -
- Advertisement -

* మహిళ మృతి, 9 మందికి గాయాలు
సూర్యాపేట: మునగాల 65వ జాతీయ రహదారిపై మండల పరిధిలోని ఆకుపాముల గ్రామ శివారులో శుక్రవారం ఆటోని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా 9 మందికి గాయాలైయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని తాడ్వాయి గ్రామానికి చెందిన మంజుల రామకృష్ణ ఉమారాణి దంపతులు తన చిన్నారితో కలిసి సొంత ఆటోలో కోదాడ వైపు వెళ్తూ బరాగద్గూడం ముకుందాపురం గ్రామంలో ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లుతుండగా మార్గమద్యంలో ఆకుపాముల గ్రామశివారులో కారు అతివేగంతో వచ్చి ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మంజుల ఉమారాణి(30) అక్కడికక్కడే మృతిచెందగా ఆటోలో ప్రయాణిస్తున్న కందిబండ, గణపారం గ్రామానికి చెందిన పడమర్తి నాగమణి, పడమర్తి పద్మ, పడమర్తి నాగరాజు, పడమర్తి చిన్నారిలకు తీవ్ర గాయాలకు గురి కాగా మరో ఐదుగురికి గాయాలైయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ఏరియా హాస్పటల్‌కు తరలించారు. ఈ మేరకు కేసు ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News