Monday, November 25, 2024

బిజెపి కార్పోరేటర్ వంగా మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన బిజెపి కార్పోరేటర్‌తో పాటు మరో వ్యక్తిపై ఐఎస్ సదన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నింధితులు ఇద్దరికీ సిఆర్పీసి 41(ఏ)సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఎప్పుడు పిలిస్తే అప్పడు విచారణ అధికారి లేదా కోర్టులో హజరు కావాలని అందులో పేర్కొన్నారు. కేసుకు సంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బిజెపి కార్పోరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి , తన అనుచరుడైన శ్రీనివాసరెడ్డితో కలిసి మంగళవారం చంపాపేట, మారుతీ నగర్ స్ట్రీట్ నంబర్ 1లో ఎటువంటి అనుమతి లేకుండా ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించారు.

ఇది గమనించిన ఎన్నికల అధికారి బాగల్ కోట్ శ్రీకాంత్ ఐఎస్ సదన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో మారుతీనగర్ వెళ్ళిన పోలీసులు అక్కడ జరిపిన విచారణలో వంగా మధుసూన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డిలు ఎటువంటి అనుమతులు లేకుండా ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇద్దరిపై ఐపిసి 314, 188, 171 ( హెచ్),సిపీ యాక్ట్ సెక్షన్ 21/ 76 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇద్దరికీ సిఆర్పీసీ యాక్ట్ సెక్షన్ 41(ఏ) ప్రకారం నోటీసులు జారీ చేశారు. కేసును సిఐ మల్లేష్ దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News