Sunday, January 19, 2025

మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఉండి ఎంఎల్ఏ రఘురామకృష్ణమ రాజు ఫిర్యాదుతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కేసు నమోదయింది. జగన్ తో పాటు అప్పటి సిఐడి డిజి సునీల్ కుమార్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామ కృష్ణమ రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు. జగన్ ఒత్తిడి వల్లే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదులో తెలిపారు. ఈ కేసులో జగన్ ఏ3గా ఉన్నారు. కాగా ఏ1 గా సిఐడి మాజీ డిజి సునీల్ కుమార్, ఏ2గా ఐపిఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను పోలీసులు చేర్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News