Saturday, April 5, 2025

హయత్‌నగర్ జీ స్కూల్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

తుర్కయంజాల్‌ః స్క్రాఫ్ కట్టుకొని పాఠశాలకు వచ్చినందుకు 10వ తరగతి చదువుతున్న విద్యార్ధినిని తరగతి గదిలో విద్యార్దుల ముందు పాఠశాల యాజమాన్యం తీసివేయాలి, లేకుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. దీంతో విద్యార్ధిని తల్లితండ్రులు హయత్‌నగర్ పోలీస్‌స్టెషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హయత్‌నగర్ పాతరోడ్డులో ఉన్న జీ స్కూల్‌లో ఓ ముస్లిం విద్యార్ధిని 10వ తరగతి చదువుతున్నారు. రోజు మాదిరిగా తలకు స్క్రాఫ్ కట్టుకొని పాఠశాలకు హజరైంది. దీంతో పాఠశాల యాజమాన్యం స్క్రాఫ్ అనుమతి లేదు.

ధరించడం కుదరదని చేప్పారు. మధ్యహ్నం భోజన సమయం విద్యార్దులు భోజనం చేస్తుండగా ప్రిన్సిపల్ వారి దగ్గరకు వచ్చి పాఠశాలకు అందరూ సమానమే, ముస్లిం ఉపాధ్యాయులు కూడ పాఠశాల అవరణలోకి రాగానే బుర్క తీసివేస్తారు, కావున విద్యార్ధిని కూడ తీసివేయాలని బలవంత చేసినట్లు తెలిపారు. ఇట్టి విషయాన్ని విద్యార్ధులు తల్లి తండ్రులకు దృష్టికి తీసుకవెళ్లడంతో శనివారం వారు హయత్‌నగర్ పోలీస్‌స్టెషన్‌లో పిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు జీ స్కూల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇట్టి విషయంపై పాఠశాల యాజమాన్యాన్ని వివరణ కొరగా పాఠశాలలో విద్యార్దులు అందరు సమానమే అందరికి ఓకే విధంగా యూనిఫాం ఉండాలని పేర్కొన్నట్లు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News