Friday, December 20, 2024

ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి : ఫ్లెక్సీల విషయంలో అధికార పార్టీ అనుచరులు జిహెచ్‌ఎంసి సిబ్బందిపై దాడి చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మూసాపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను డిసి ఆదేశాలతో తొలగిస్తున్న జిహెచ్‌ఎంసి సిబ్బందిని స్ధానిక ఎమ్మెల్యే అనుచరులు ఎందుకు తొలగిస్తున్నావని ప్రశ్నించడంతో ఏర్పడ్డ వివాదంతో జిహెచ్‌ఎంసి సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులపై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు పూర్వపరాలను దర్యాప్తు చేసి పూర్తి సమాచారం అందించడంతో పాటుగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలిసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News