Monday, January 20, 2025

జింక కూర అని కుక్క కూర అమ్మిన వ్యక్తుల పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

లక్ష్మణచాంద : జింక కూర అని నమ్మించి కుక్కల కూర అమ్మిన ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై రాహుల్ గైక్వాడ్, స్థానికుల వివరాల ప్రకారం .. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కొన్ని రోజులుగా వీధి కుక్కలను చంపేస్తూ వాటి మాంసాన్ని జింక మాంసంగా సృష్టించి జనాలకు రహాస్యంగా అమ్మకాలు జరిపినట్లు తెలిపారు. స్థానికంగా కొందరికి అనుమానం వచ్చి పోలీసులకు సమా చారం ఇవ్వగా విచారణ చేపట్టిన పోలీసులు అది జింక మాంసం కాదని , కుక్క మాంసం అని నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News