Saturday, December 28, 2024

మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ భూమి ఆక్రమించారని షేక్‌పేట్ తహసిల్దార్ ఫిర్యాదు
కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మాజీ ఎమ్మెల్యేపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్, రోడ్డు నంబర్ 3, ప్లాట్ నంబర్ 8 సిలో 2,185 చదరపు గజాల ప్రభుత్వ భూమి ఉంది. దాని పక్కనే ఉన్న ప్లాట్ నంబర్ 8డిని షౌకత్ ఉన్నీషా అనే వ్యక్తి వద్ద నుంచి పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కొనుగోలు చేశారు.

దాని పక్కనే 8సి ఉండడంతో గతంలో మాజీ ఎమ్మెల్యే కబ్జా చేసి నిర్మానం చేపట్టేందుకు ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలియడంతో షేక్‌పేట తహసిల్దార్ వెంటనే అక్కడికి చేరుకుని భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఉపేందర్ రెడ్డి మళ్లీ ఆక్రమించుకుని నిర్మానం చేపట్టేందుకు ప్రయత్నించారు. దీంతో షేక్‌పేట తహసిల్దార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేసి మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News