- శిరీషను హత్య చేసినట్లు ఒప్పుకున్న బావ
- విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించిన ఎస్పీ
పరిగి: మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామంలో గత మూ డు రోజలు క్రితం జరిగిన శిరీష హత్య కేసును పరిగి పోలీసులు బుధవారం ఛేదించారు. మృతురాలి బావ ఎర్రగడ్డ పల్లి అనిల్ హత్య చేసినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి పలు విషయాలను ఎస్పీ వివరించారు.
మండలం లోని ఖుదావన్‌పూర్ గ్రామ శివారులో కాళ్లాపూర్ గ్రామానికి చెందిన జట్టు శిరీష (18) ఈ నెల 11వ తేదీన హత్య చేసి నీటి కుంటలో పడవేసిన సంఘటనపై అన్న శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నెం 134/2023, యు/ఎస్ 302 ఐపిఎస్ కింద నమోదు చేసి పరిశీలిం చామని తెలిపారు. ఈ కేసులో ముద్దాయి పరిగి బహార్ పేట్‌కు చెందిన ఎర్రగడ్డపల్లి అనిల్ మిషన్ భగీరథలో గార్డెనింగ్ వర్క్ చేస్తుంటాడు. అనిల్ మృతురాలి అక్కకు భర్త. తానే ఈ నేరాన్ని చేసినట్లు ఒప్పుకున్నాడని చెప్పారు. గత ఏడాది నుంచి మరదలు శిరీషను ఏదో రకంగా అనిల్ శారీరకంగా అనుభవించాలని అనుకున్నాడు. వికారాబాద్‌లో నర్సింగ్ పని చేసుకుంటూ ఉండే శిరీష ఈ మధ్యలో కాళ్లాపూ ర్‌కు వచ్చింది.
అవకాశం కోసం ఎదిరుచూస్తున్న సమయంలో శిరీష మరో అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడుతుందనే అనుమానం 6 నెలల నుంచి కలిగింది. నాతో మాట్లడకుండా వేరే వాడితో ఉందనే కోసం పెంచుకు న్నాడు. మృతురాలి తల్లి ఆరోగ్యం బాగలేదని అందుకు తండ్రి జంగయ్య తమ్ముడు శ్రీనివాస్‌లు వంట వండటం లేదని అమ్మాయితో గొడవపడ్డారు. దీంతో అలిగిన శిరీష ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అనిల్ బైక్‌పై వచ్చి మృతురాలిని వెతుకుతుండగా మధ్యలో గోనే మైసమ్మ ఆల యం వద్ద కనిపించిన శిరీషను ఎలాగో అనుభవించాలని అనుకున్నాడు.
నాతో కాకుండా ఎవరితోనో ఉన్నావని ఎలాగైన చంపాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆమెను నీటి కుంట వద్దకు తీసుకవెళ్లి చేతులపై కర్రలతో కొట్టాడు. పగిలిన ఖాళీ సీసాతో కళ్లలో పొడిచి సీసాను అదే కుంటలో పడేశాడు. అమెను అదే కుంటలోకి తీసుకవెళ్లి నీటిలో ముంచేసి చనిపోయిందని తెలుసుకున్న తర్వాత అక్కడే కాళ్లు, చేతులు కడుకుని బైక్‌పై వెళ్లిపోయినట్లు వివరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితున్ని పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నందుకు అనిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బలమైన సైంటిఫిక్, టెక్నికల్, ఇతర సాక్షాలు సేకరించి నేరస్తుడిని త్వరగా పట్డుకోవడం జరిగిందన్నారు. చట్ట పరంగా శిక్ష పడేటట్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో కూడా ఆతనిపై పరిగి లో పలు కేసులు నమోదైనట్లు తెలిపారు.