Monday, December 23, 2024

సిఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి : ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కెసిఆర్‌పై అసభ్య పదజాలం ప్రయోగించిన సిఎం రేవంత్‌ రెడ్డిపై పోలీసులు ముందుగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. మాజీ ఎంఎల్‌ఎ, దళిత బిడ్డ బాల్క సుమన్‌పై ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఎక్స్ (ట్విట్టర్ వేదికగా) కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంభించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తున్నదని విమర్శించారు. సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News