Friday, December 27, 2024

మంత్రి సహకారంతో మారిన పట్టణ రూపురేఖలు

- Advertisement -
- Advertisement -
  • మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి

మేడ్చల్: మేడ్చల్ మున్సిపల్ పరిధి 13వ వార్డులో రూపాయలు 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సి్సి రోడ్డు పనులను మేడ్చల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి దీపిక నర్సింహా రెడ్డి స్థానిక కౌన్సిలర్ మర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి సూచనల అనుసారం మేడ్చల్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో నూతన సిసి, బిటి రోడ్లు, అంతర్గత మురుగు కాలువల నిర్మాణాలతో దీర్గకాలిక ప్రజా ఇబ్బందులను తొలగించామని అన్నారు.

మంత్రి మల్లారెడ్డి సహాయ సహకారాలతో పట్టణ రూపురేఖలు మార్చామని అన్నారు. కౌన్సిలర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, మంత్రి మల్లారెడ్డి, మున్సిపల్ చైర్ పెర్సన్ మర్రి దీపిక నర్సింహా రెడ్డి ల సహకారం తో 13 వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి, పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహా రెడ్డి, కాలనీ ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News