Wednesday, January 22, 2025

రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా 3వ పంటకు సిద్దం అవుతుంటే , రైతులకు ఉచిత,నాణ్యమైన విద్యుత్ అవసరంలేదని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మంగళవారం నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక ఎంపిపి సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా జెడ్‌పి చైర్మన్ బండ నరేందర్‌రెడ్డితో కలిసి హాజరై మాట్లాడుతూ గత పాలకులు హయాంలో రైతులకు నకిలి విత్తనాలు, అస్తవ్యస్థ కరెంటు ,ఎరువుల కొరత ,పెట్టుబడి ధరలేక వేరే రాష్ట్రాలకు వలస వెళ్లేవారని అన్నారు.

నేడు సిఎం కెసిఆర్ ప్రభుత్వంలో రైతు బంధు, రైతుబీమా లాంటి కార్యక్రమాలతో రైతన్నకు భరోసా ఇస్తున్నారని ,ఇది వాళ్లకు మింగుడు పడటంలేదని దుయ్యబట్టారు.రైతాంగానికి 3గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో బొంద పెట్టాలని , 24గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చే బిఆర్‌ఎస్ ప్రభుత్వంకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షులు యానాల అశోక్‌రెడ్డి, వివిద హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, నాయకులు , రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News