Sunday, December 22, 2024

ఊయలే ఉరితాడైంది

- Advertisement -
- Advertisement -

ఊ యల చీర ఉరితాడు గా మారి చి న్నారి మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా, ఉంద్యాల గ్రా మంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రా మానికి చెందిన గొల్ల కురుమూర్తి, శైలజ దంపతుల కుమార్తె అ నూష (11) వనపర్తి జిల్లా, ఆత్మకూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం ఇంటిముందు సజ్జ్జకు చీరతో వేసిన ఉయ్యాలలో ఊగేందుకు వెళ్లింది. అయితే, ప్రమాదవశాత్తూ చీర గొంతుకు బిగుసుకోగా, గమనించిన ఆమె తల్లి తన భర్తకు విషయాన్ని తెలిపింది. చుట్టుపక్కల వాళ్లు పాపను అమరచింతలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News