Thursday, January 23, 2025

ట్రాక్టర్ ట్రాలీ టైరు కిందపడి చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

కేశంపేట: మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ట్రాక్టర్ ట్రాలీ టైరు కింద పడి చిన్నారి మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వట్టెల మల్లేష్, బాలమణిల కుమారుడు వట్టెల విష్ణు (2)పై కేశంపేట గ్రామానికి చెందిన తిమ్మగళ్ల మత్తు అజాగ్రత్తగా ట్రాక్టర్ నడుపుతూ ట్రాలీ టైరు ఎక్కించడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటివరకు ఆడుతూ వున్న చిన్నారి మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News