- Advertisement -
టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) : ఇజ్రాయెల్ లోని అనేక నగరాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హోరెత్తుతున్నాయి. శనివారం అనేక నగరాల్లో వీధుల్లో ప్రజలు చేరి ఆందోళనల్లో పాల్గొన్నారు. న్యాయవ్యవస్థను బలహీనం చేసే రాజకీయ నేతలకు ఎక్కువ అధికారాలు కల్పించే విధంగా బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రజలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.
సుప్రీం కోర్టును బలహీన పర్చి, న్యాయపరమైన అధికారాలని పరిమితం చేయడానికి, రాజకీయ నాయకులకు ఎక్కువ అధికారాలు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని విమర్శకులు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు సోమవారం పార్లమెంట్‌లో కొన్ని చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై వ్యాపార వర్గాలు, వృత్తిదారులు పాక్షికంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. గత ఆరు వారాలుగా ఈ ఆందోళనలు సాగుతున్నాయి.
- Advertisement -