Thursday, January 23, 2025

ఘట్‌కేసర్ రైల్వే వంతెన నిర్మాణ సాధనకు సమష్టిగా పోరాటం

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్: ఏళ్ళ తరబడి నత్త నడకనా సాగుతున్న ఘట్‌కేసర్ రైల్వే వంతెన నిర్మాణ పనులు వేగవ ంతం చేసుకునే విధంగా అఖిల పక్షాలు అన్ని ఏకమై ఉధ్య మం చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని ఘట్‌కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ కోరారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ శివారెడ్డి గూడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో అబ్బ సాని యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, ప్రజా సంఘాల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైల్వే వంతెన నిర్మాణా పనులు ఏళ్ళ తరబడి నత్తనడకన సాగుతున్నా యని, ఘట్‌కేసర్ మీదుగా వివిధ ప్రాంతాలకు రైల్వే ప్రధాన మార్గం కావడంతో నిత్యం వందలాది ప్యాసింజర్ రైల్లు, గూడ్స్ రైల్లు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయని, ఇలాంటి పరిస్థితిలో ఈడబ్లుఎస్ కాలనీ, బాలాజీ నగర్, గాంధీనగర్, కొండాపూర్, మీదుగా కరీంన గర్ జాతీయ రహదారికి వెళ్ళాల్సిన ప్రజలు రైల్వే గేటు వద్ద త్రీవ ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

తెలం గాణ ప్రభుత్వం నిర్లక్షం వలనే పనులు నత్తనడకనా సాగు తున్నాయని, దానిని సాధించుకోడానికి సమిష్టి కృషి ఎంతో అవసరమని తెలిపారు. త్వరలో కార్యచరణ చేసుకొని ముం దుకు సాగాల్సిన అవసరం ఎంతైన ఉందని, అందుకు రాజ కీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కలసి రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మిసాల మల్లేష్, కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, ఘణపూర్ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు చింతల యాద య్య, సిపిఐ జిల్లా నాయకులు కల్లూరి జయచంద్ర, టిడిపి మండల అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, బిజేపి మున్సిపా లిటీ అధ్యక్షుడు హనుమాన్, నాయకులు మారం లకా్ష్మరెడ్డి, కొమ్మిడి మహిపాల్ రెడ్డి, ఎన్. సబిత, లొట్టి ఈశ్వర్, ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News