Monday, December 23, 2024

వ్యాపారుల కోసం కాంపాక్ట్ ఎంబిఏ

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: ఎడ్యుకేషన్ స్కూల్‌లో స్టార్టప్స్‌ను ఎలా తయారు చేయాలి, మార్కెట్‌లోకి ఎలా తీసుకుని వెళ్లాలో నేర్పిస్తామని మాగ్నా ఫౌండర్ శైలేంద్ర దీపరాజు అన్నారు. వ్యాపారులు, ఎగ్జిక్యూటివ్‌లు కోసం కాంపాక్ట్ ఎంబిఏ ప్రొగాంను రూపొందించామని మా గ్నా ప్రతినిధులు తెలిపారు. టి హబ్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంబిఏను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎల్‌వి ప్రసాద్ ఐ ఆస్పత్రి వైద్యుడు రాజీవ్‌ప్రసాద్, రిటైల్ ఆల్కెమిస్ట్ గ్రూప్ ప్రతినిధి దీప్‌సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా గ్నా ఫౌండర్ శైలేంద్ర దీపరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ టిహబ్‌లో స్టార్టప్‌ను ప్రోత్సహించేందుకు వరల్డ్‌లోనే అతిపెద్దదైన ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏ ర్పాటు చేశారని తెలిపారు. స్టార్టప్స్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా ఎలా విజయవంతంగా నడిపించాలో నేర్పించేందుకు మా గ్నా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కూల్‌ను ప్రారంభించామని తెలిపారు. ఈ స్కూల్ తెలంగాణ, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకుని వస్తుందని తెలిపారు.

మాగ్నా స్కూల్ ద్వారా పారిశ్రామికవేత్తలను, కొత్తస్టార్టప్స్‌లను ఒకే వేదిక మీదకు తీసుకుని వచ్చి చర్చించడానికి సులభంగా ఉంటుందని తెలిపారు. ఈ వేదికపై వ్యాపారవేత్తలు తమ అనుభవాలను పంచుకుంటారని తెలిపారు. మాగ్నా స్కూల్ ప్రొగ్రాం స్టార్ట్ చేసిన ఎంటర్‌ప్రెన్యూర్‌కు పదివారాలు, ఇరవై నాలగు గంటల్లో కంపెనీ స్టార్ట్ చేయడం, ప్రొడక్ట్ బిల్డ్ చేయడం, మార్కెట్‌లోకి తీసుకుని వెళ్లడం, క్యాప్టలిస్టులతో పరిచయం వంటి అంశాలపై పేరుప్రఖ్యాతులు ఉన్న వారితో టీచింగ్ చేయిస్తామని తెలిపారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్స్ అందజేస్తామని తెలిపారు. బెస్ట్ రీసెర్చ్, ఎడ్యుకేటర్స్, వెంచర్ క్యాప్టలిస్టులు, ఎంటర్‌ప్రెన్యూర్‌ను ఒకే వేదిక మీదకు తీసుకురావడం మాగ్నా ఉద్దేశమని అన్నారు.

వ్యాపారులు పరిశోధన, ఆచరణాత్మక అనుభవంలో బలమైన పునాదిని ఏర్పర్చుకునేందుకు ఈ ఎంబిఏ తోడ్పడుతుందని తెలిపారు. ఈ ఎంబిఏ వ్యాపార నాయకత్వానికి ప్రభావంతమైన వనరుగా ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికాలోని చికాగోలో ఈ ఎంబిఏ కోర్సు విజయవంతంగా కొనసాగుతోందని, అందువల్లే హైదరాబాద్‌లో కోర్సును ప్రవేశపెడుతున్నామని తెలిపారు. వ్యాపారులు మరింత వృద్ధి చెందేందుకు ఈ కోర్సు అన్ని విధాలా తోడ్పడుతుందని తెలిపారు. వ్యాపారులు దీని వల్ల త మ వ్యాపారంలో మరింత ముందుకు వెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, స్టార్టప్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News