Monday, December 23, 2024

మేడిగడ్డ బ్యారేజీ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి : కోదండరాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదంలో పడిపోయిందని తెలంగాణ జనసమితి (టిజెఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పై ఉన్న బ్రిడ్జి కుంగిపోయిందని తెలిపారు. ఈ ఘటనపై జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటీ న్యాయ విచారణకు ఆదేశించాలని కోదండరాం డిమాండ్ చేశారు. పిల్లర్ కుంగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు. బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. నిబంధనల ప్రకారం నిర్మాణాలు జరిగేవిధంగా ప్రభుత్వం శ్రద్ద కనబరుచలేదని తెలుస్తోందని, భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఆయన ఆరోపించారు.

ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టును హడాఉడిగా పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మల్లన్న సాగర్‌లో 15 టిఎంసిలకు మించి నింపలేమని, ఎల్లంపల్లి వద్ద టన్నల్స్ లీక్ అవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉండేదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయించాలని, ఇందుకు బాద్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని ఆయన కోరారు. డ్యాం భద్రతపై ప్రజలకు వాస్తవ సమాచారం అందించాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News