- Advertisement -
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ : వరద సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం హైకోర్టులో భారీవర్షాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ నిర్వహించింది. వరద ప్రాంతాల్లో ఏం చర్యలు చేపట్టారో తెలపాలని ఆదేశించింది. వరదల్లో ఎందరు మరణించారు? బాధితులకు పరిహారం చెల్లించారా? ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించారు? వరదల పర్యవేక్షణ, సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించింది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారా? అని హైకోర్టు అడిగింది. ఈ నెల 31వ తేదీలోపుగా పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
- Advertisement -