Friday, December 27, 2024

మేడిగడ్డకు నేడు మంత్రుల బృందం

- Advertisement -
- Advertisement -

నేడు మేడిగడ్డకు మంత్రుల బృందం

మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదీజాలాల ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం నిర్వహణ తీరు తెన్నులపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజిని పరిశీలింనుంది.

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు మేడి గడ్డ ప్రాజెక్టు సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మంత్రులు మెడిగడ్డ బయలుదేరుతారు. మెడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై నీటి పారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారు.ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ,నష్టాలను విశ్లేషన చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం.. కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు పరిశీలించనున్నారు.

ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్, మెడిగడ్డ, సిందిళ్ళ, అన్నారం బ్యారేజ్ ల సమస్యలు, వాటి పరిష్కారాలు..తదితర అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులు , కాంటాక్టు ఏజేన్సీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రాజెక్టు అనంతరం మెడిగడ్డ, అన్నారం బ్యారేజ్ లను సందర్శించి పరిశీలన చేయనున్నారు.ఈ పర్యటన కు సంబంధించి నిర్మాణ సంస్థలకు సబ్ కాంట్రాక్టర్లలకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికీ సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలపి ఈ.ఎన్.సిని  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News