Monday, December 23, 2024

జాతీయ విద్యావిధానంతో పేదలకు విద్యను దూరం చేసే కుట్ర

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: జాతీయ విద్యావిధానం పేరుతో బడగు, బలహీన వర్గాల పిల్లలను చదువుకు దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని,ఈ విధానానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజాస్వామిక వాదులంతా పోరాడాలని ప్రొఫెసర్ హరగోపాల్ కో రారు.ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్ర వేట్ పంక్షన్ హాల్లో డెమక్రాటిక్ టీచర్స్ ఫెరడేషన్ రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం పేరుతో పేదలకు చదువు దూరం చేసేందుకు ప్రయత్నించడం దారుణమైన చర్య అని అన్నారు. ఎవరైనా 8వ తరగతి తర్వాత డ్రాప్ కావచ్చనని చెప్పడం, విద్యావిధానం సైన్స్ మహాద్యుడు,మానవ పరిణామ సిద్దాంతాన్ని శాస్త్రీయంగా చెప్పిన డార్విన్‌ను తొలగించడం వంటి అనేక చర్యలు ఉన్నాయన్నారు. స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీని కూడా తక్కువ చేసే విదానాని అమలు చేయబోతున్నారని ఆరోపించారు.పేదలకు చదువు, విజ్ఞానం అందించాలని మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, సాహూ మహారాజ్‌లాంటి త్యాగాల ఫలితమే అంతో కొంతో పేదలకు విద్య అందిందన్నారు.

అలాంటి విద్యను కూడా దూరం చేసి మొత్తంగా విద్యలో కూడా కాషాయీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. పేదలకు చదువు ఒక నేరంగా భావించే మనుదర్మపు సిద్దాంతాన్ని నూరిపోసే కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే జాతీయ విద్యావిదానానికి వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారని, మన రాష్ట ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కామన్‌విద్యావిధానం ఉండాలని, శాస్త్రీయ విద్యా విధానం ఉండాలని, అన్ని వర్గాలకు సమ విద్య ఉండాలని, సమాజంలో మంచి విలువలు గల విద్యా విదానం ఉండాలని చారిత్రాత్మక పోరాటం చేసింది డిటిఎఫ్ మాత్రమేనని అన్నారు. డిటిఎఫ్ సంస్ధ ఎన్నో ఆటుపోట్లకు గురి కావడమే కాకుండా ఎంతో మంది త్యాగాలు చేశారన్నారు. సమాజ మార్పు కోసం పోరాడిన డిటిఎఫ్‌పై రాజ్యం కక్షగట్టి అనేక అనిచివేతలకు గురి చేసిందన్నారు. ప్రస్తుతం పేద వర్గాల తల్లిదండ్రుల్లో తమ పిల్లలకు చదువు కావాలని కోరుకుంటున్న తరుణంలో రాజ్యం పేద పిల్లలకు చదువును దూరం చేసేందుకు ప్రణాళికలు చేస్తోందని విమర్శించారు.

ప్రపంచంలో అభివృద్ద్ది చెందిన దేశాలను పరిశీలిస్తే ఆ దేశంలో ప్రజలందరికి సమాన విద్య,కామన్ విద్యావిదానం వలనే ఆ దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. మన దేశంలో పేద పిల్లలకు విద్యను దూరం చేసేందుకు బలమైన కుట్ర చేస్తున్నారని,దీనిని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రవేట్ పరమైన నేపథ్యంలో భవిష్యత్ తరమైన యువత కూడా పెడదోరణలు పడుతున్నారని చెప్పారు. కార్పొరేట్ విద్యను చదవి వస్తున్న ఐఎఎస్,ఐపిఎస్‌లాంటి వారు ఉద్యోగంలో వారు ప్రజల ఆలోచన విదానానికి వ్యతిరేకంగా రాజ్యం చేతిలో పని చేసే యంత్రాలుగా మారిపోతున్నారని చెప్పారు. లక్షలు పెట్టి చదవిన డాక్టర్ అడవిలో వెళ్లి వైద్యం చేస్తాడా అని ప్రశ్నించారు.

సమాజానికి,మనిషికి మద్యన మంచి సంబందాలు, విలువలు ఉ న్నప్పుడే సమాచం పురోగతి చెందుతుందన్నారు.ఈ లోపభూయిస్టమైన విద్యా విద్యావిధానానికి వ్యతిరేకంగా డిటిఎఫ్‌తో పాటు ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 15,16,17 న మహబూబ్‌నగర్‌లో జరిగే డిటిఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. విలేకర్ల సమావేశంలో డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య. ప్రదాన కార్యదర్శి లింగారెడ్డి,ప్రొఫెసర్ లక్ష్మినారాయణ,వనమాల,పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి,డిటిఎఫ్ నుంచి ఆదిత్య, వెంకటేశ్వర్లు, శ్రీశైలం, ఐఎఫ్‌టియు ఖలీల్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఒబేదుల్తా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News