ముషీరాబాద్: మృగశిర కార్తె పురస్కరించుకుని నగరంలోని రాంనగర్ చేపల మార్కెట్ గురువారం కిటకిటలాడింది. మృగశిర కార్తె సందర్భంగా చేపలు తినడం ఆనవాయితీ కావడంతో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాంనగర్ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఏలూరు, వైజాగ్ తదితర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కొల్లాపూర్ తదితర ప్రాంతాల నుంచి సుమారు 50 టన్నులు చే పలు రాంనగర్ మార్కెట్‌కు దిగుమతి అయినట్టు అంచనా. ఈ నేపథ్యంలో చేపల మార్కెట్ నిర్వాకులు మృగశిర కార్తె అమ్మకాలకు ప్రత్యేక ఏర్పాటు చేశారు.
రాత్రిపూట ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో రవ్వు, బొచ్చా చేపలు కిలో రూ.100 నుంచి రూ. 110లు, కొర్రమీను చేపలను కిలో రూ. 400 లను విక్రయించేవారు. కానీ, మృగశిర కార్తె పురస్కరించుకుని రవ్వు, బొచ్చలను రూ. 120 నుం చి రూ. 130లు, కొర్రమీను చేపలను రూ. 550ల వరకూ విక్రయించారు. ఈ అమ్మకాలు శుక్రవారం కూడా జరగనున్నాయి.
రాంనగర్‌లో కిటకిటలాడిన చేపల మార్కెట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -