Saturday, September 14, 2024

సూడాన్‌లో భారీ వర్షాలకు కూలిపోయిన డ్యాం

- Advertisement -
- Advertisement -

కైరో: పోర్టు సూడాన్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్బాత్ డ్యాం లకూలిపోవడంతో వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకోగా 30 మంది మరణించినట్లు ఐక్య రాజ్య సమితి(యుఎన్)కు చెందిన సంస్థ తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఆదివారం రాత్రి డ్యాం కూలిపోగా 20 గ్రామాలు పూర్తిగా ధ్వంసమైనట్లు మానవతా వ్యవహారాల సమన్వయ సంస్థ వెల్లడించింది. డ్యాం చుట్టూ ఉన్న 70 గ్రామాలు భారీ వరదల్లో చిక్కుకున్నాయని తెలిపింది.

మరణాల సంఖ్య కచ్ఛితంగా ఎంత అన్నది తెలియరాలేదని కూడా తెలిపింది. డ్యాంకు పశ్చిమ వైపున భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం డ్యాంను ముంచెత్తంతో డ్యాం కూలిపోయినట్లు సంస్థ తెలిపింది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న జనాభాలో 70 శాతం మంది..సుమారు 50,000 మంది వరదల కారణంగా నిరాశ్రయులు అయినట్లు యుఎన్ స్ంస తెలిపింది. 10,000 పశువులు గల్లంతయ్యాయని, 70 పాఠశాలలు పూర్తిగా ధ్వంసమయ్యాయని సంస్థ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News