Thursday, January 23, 2025

చెట్ల పోదలల్లో ఆడ శిశువు మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:గుర్తుతెలియని అప్పుడే పుట్టి చనిపోయిన ఆడ శిశువు మృతదేహం లభ్యమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి మున్సిపల్ పట్టణపరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం భువనగిరి మున్సిపాల్ పట్టణ కేంద్రంలోని బాబు జగ్జీవన్ రావు భవనం సమీపంలో గల చిన్నపొదల చాటున ఓ మహిళలకు శిశువు మృతదేహం కనిపించింది.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం బాగారం లావణ్య అనే మహిళ పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో బిఎస్పి సమావేశానికి హాజరై సమావేశం పూర్తి కావడంతో సమావేశ మందిరం నుండి బయటికి వెళ్తున్న సమయంలో పక్కనే కుక్కలు అప్పుడే పుట్టి మృతి చెందిన ఆడ శిశువును తింటున్నట్లు గమనించింది. కుక్కలను వెళ్లగొట్టి చూడగా అప్పటికే శిశువు మృతి చెందినట్లు గమనించారు.

ఆ మహిళ వెంటనే భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పట్టణ ఇన్స్పెక్టర్ సుధీర్ కృష్ణ సందర్శించి మృతదేహాన్ని పరిశీలించి ఘటనా స్థలం వద్ద వివరాలు సేకరిస్తు చుట్టూ పక్కల ప్రాంతాలలో ఉన్న ప్రజలని విచారణ కొనసాగించారు. శిశువు మృతదేహం ఎక్కడి నుండైనా తెచ్చి ఇక్కడ పడేశారా? అనే కోణం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. శిశువు మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News