Monday, December 23, 2024

శిథిలావస్థలో వైద్యశాల

- Advertisement -
- Advertisement -

బాసర : మూగజీవాలకు వైద్యం అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పశువైద్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇటీవల ఇందంపలో భాగంగానే సంచార వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. వైద్య సేవలు అందించడంలో మక్కువ చూపుతు న్న కొత్త భవనాల నిర్మాణంలో మాత్రం ఏ మాత్రం శ్రద్ధ్ద చూపడం లేదు. బాసరలో ఉన్న పశువైద్య కేంద్రం శిథిలావస్థకు చేరింది. దీంతో చిన్నపాటి వర్షాలు కురిస్తేనే పై కప్పు నుంచి వర్షపునీరు గదుల్లోకి చేరుతుంది.

పశువైద్యశాలలో ఉన్న విలువైన మందులతో పాటు రికార్డులు తడిసి ముద్దయిపోతున్నాయి. పశు వైద్యశాలకున్న కిటికిల తలుపులు ఊడిపోయాయి. పైకప్పు పెచ్చులూడీ కూలిపోయే దశకు చేరింది. ఈ భవనంలో విధులు నిర్వహించాలంటే సిబ్బంది సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కొత్త భవనాన్ని నిర్మించాలని రైతులు, మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News