Monday, January 20, 2025

నిజామాబాద్ లో జంట హత్యల కలకలం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్‌బ్యూరో: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. అక్కాచెల్లెలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి దహనానికి యత్నించారు. స్థానికులు అప్రమత్తమై హడావుడి చేయడంతో పారిపోయారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్‌నగర్ కాలనీకి చెందిన మగ్గిడి రాజవ్వ (72), మగ్గిడి గంగవ్వ (62)లు గత కొంతకాలంగా ఒకే ఇంటిలో జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వారి తలపై బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు.

అనంతరం ఆ రెండు మృతదేహాలను దుండగులు దహనం చేయడానికి యత్నించారు. చుట్టూపక్కల వారు గమనించి అప్రమత్తమయ్యారు. గట్టిగా కేకలు వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు హుటాహుటిన దుం డుగుల పారిపోయారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు డాగ్ స్కాడ్స్‌ను, క్లూస్ టీంను రంగంలోకి దించి ఆధారాలను సేకరించారు. ఇంచార్జి కమిషనర్ ప్రవీన్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. అయితే అక్కా చెల్లెల హత్యకు ఆస్తి తగాదాలా లేదంటే దోపిడీ దొంగల పని అనే కోణంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News