Wednesday, January 22, 2025

ఎన్నో యేండ్ల కల..సాకారమైన వేళా

- Advertisement -
- Advertisement -
  • వారం రోజుల్లో గౌరవెళ్లి ప్రాజెక్టు పూర్తి
  • త్వరలో జల సవ్వడితో గౌరవెల్లి
  • త్వరలో గండిపల్లి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం
  • హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

అక్కన్నపేట: ఎన్నో ఏండ్లగా ఎదురు చూస్తున్న కల గోదావరి జలాలతో మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ముద్దాడనున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం అక్కన్నపేట మండలంలోని గౌరవెళ్లి ప్రాజెక్టును హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సందర్శించి చీఫ్ ఇంజనీర్, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 25న తర్వాత సిఎం కెసిఆర్ చేతుల మీదగా గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభించి, మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గానికి నీరందిస్తామన్నారు. కొన్ని ఏళ్లుగా మెట్ట ప్రాంతంలో సాగునీటి సమస్య మెండుగా ఉందని ఈ సమస్య గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభంతో తీరనుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,06,000 ఎకరాలకు నీరు అందబోతుందని రైతులు సిరుల పంట పండించుకోవచ్చని పేర్కొన్నారు.

శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు 125 కిలోమీటర్లు మధ్యలో మిడ్ మానేరు నుంచి గౌరవెల్లికి కాళేశ్వరం జలాలు రాబోతున్నాయి. గతంలో 1.4 టిఎంసి డిజైన్ చేయబడిన ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కెసిఆర్ గారు ప్రత్యేక శ్రద్ధతో 8.23 టిఎంసిలు పెంచారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు కాళేశ్వరం ద్వారా 365 రోజులు నీళ్లు వస్తాయి. 96 మెగా వాట్స్ 2 పంపులు ఎప్పుడూ పనిచేస్తాయి. 1 పంపు స్పేర్‌లో ఉంటుందని అన్నారు. మొత్తం గౌరవెల్లి ప్రాజెక్టు గురించి 3870 ఎకరాలు స్థల సేకరణ జరిగిందని, దేశంలో ఏ ప్రాజెక్టుకు ఇవ్వనటువంటి ప్రత్యేక పరిహారం గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 0.7 టిఎంసి నీళ్లు ప్రతిరోజు గౌరవెల్లి ప్రాజెక్టుకు వస్తాయి.

ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 57,852 ఎకరాలు, అక్కన్నపేట 4228 ఎకరాలు, హుస్నాబాద్ 10,582 ఎకరాలు, కోహెడ 11900 ఎకరాలు, సైదాపూర్ 5671 ఎకరాలు, చిగురుమామిడి 14,963 ఎకరాలు, భీమదేవరపల్లి 10,508 ఎకరాలకు సాగనీరు, హనుమకొండ జిల్లాలో వేలేరు, ధర్మసాగర్, కాజీపేట 34,832 ఎకరాలు, జనగామ జిల్లాకు 48,148 ఎకరాలకు సాగునీరు అందుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ 2215 కోట్లకు లిఫ్ట్ పంపు, స్థలసేకరణకు 484.76 లక్షలు. కేటాయించడం జరిగిందని అన్నారు.ఇందులో కుడి లిఫ్ట్ ద్వారా 90000 ఎకరాలు 47 కిలోమీటర్లు సాగునీరు, ఎడమ కాలువ ద్వారా 16000 ఎకరాలు 16 కిలోమీటర్లకు సాగునీరు అందుతుంది అని అన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల కోసం 250 కోట్లు స్థల సేకరణ కోసం వ్యయం చేయడం జరిగింది, 3919 ఎకరాలు స్థల సేకరణ జరగాల్సి ఉండగా ఇందులో 1676 ఎకరాలు స్థలం సేకరించాము, ఇంకా 2243 ఎకరాల స్థలం మిగిలి ఉందని తెలియజేశారు.గౌరవెల్లి ప్రాజెక్టు తర్వాత 1.5 టిఎంసి సామర్థ్యం గల గండిపల్లి ప్రాజెక్టు 14,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో నిర్మించడం జరుగుతుందని దీనిని త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, అక్కన్నపేట జడ్పిటిసి భూక్యా మంగా శ్రీనివాస్, హుస్నాబాద్ ఎంపిపి మానస సుభాష్, మున్సిపల్ వైస్ చైర్మన్ అనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన రజిని, వైస్ ఎంపిపి మజ్జిగ మొగిలి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లలతో ఇరిగేషన్ అధికారులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News