Thursday, December 26, 2024

ఓట్ల వేటలో నోట్ల జాతర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్/ మెదక్ ప్రతినిధి : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యా ప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడిన డబ్బు, మద్యం, ఆభరణాలు, కానుకలు, మాదకద్రవ్యాల విలువ ఇప్పటి వరకు రూ. 243 కోట్లు పైచిలు కు పట్టబడ్డాయి. అక్టోబరు 18వ తేదీ ఉదయం నుంచి అక్టోబరు 19ఉదయం వరకు పట్టుబడినవి మొత్తం విలువ రూ. 78,03,27, 446 కోట్లల్లో ఉంది. గత పది రోజుల్లో పట్టుబడిన మొత్తం నగదు: రు.87,92,49,540 కోట్లు, మ ద్యం : రూ. 10,21,19,950 కోట్లు విలువైన (మద్యం -65223 లీటర్లు,18874 కిలోల నల్ల బె ల్లం, 655కిలోల ఆలం) స్వాధీ నం చేసుకున్నారు. మత్తు పదా ర్థాలు : రూ.7,72,97,130 కో ట్లు (2950.795 కిలోల గంజా యి) విలువైన స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం, వెండి, వాటితో చేసిన ఆభరణాలు. వస్తువులు: 71,205 (181. 986 కిలోల బంగారం కిలోల వెం డి, 154.4546 క్యారెట్ల వజ్రా లు), ఇతర వస్తువులు/ఉచితాల స్వాధీనం (ల్యాప్టాప్ లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి మొదలైనవి) విలువ : రు.17,48,81,471 కోట్లు ఉం దని ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటి విలువ మొత్తం రూ..2,43,76,19,296 కోట్లలో ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అనుమానిత నగదు లావాదేవీలపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. ఖాతాల్లో భారీగా నగదు జమ, విత్ డ్రాల సమాచారాన్ని ఎన్నికల నోడల్ ఆఫీసర్ అకౌంటింగ్‌కు రోజువారీ నివేదిక అందజేయాలని ఇసి సూచించింది. ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తుండగా… 50 వేల రూపాయలకు ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా పట్టుకెళుతున్నారు. ఇదే సమయంలో కేరళ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి 750 కోట్ల రూపాయల డబ్బు.. నోట్ల కట్టలు.. ఓ లారీలో రావటం సంచలనంగా మారింది. గద్వాల్ దగ్గర తనిఖీలు చేస్తున్న పోలీసులకు.. ఓ లారీలో 750 కోట్ల రూపాయల నోట్ల కట్టలు.. అన్నీ 500 రూపాయల నోట్ల కట్టలు కనిపించటంతో.. పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే లారీని పక్కకు తీసుకెళ్లారు. పోలీస్ రక్షణ కల్పించారు. లారీలో 750 కోట్ల రూపాయలు ఉండటంతో.. గద్వాల్ పోలీసులు అలర్ట్ అయ్యారు.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత.. బ్యాంక్ డబ్బు అని తేలింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన డబ్బు అని.. కేరళ నుంచి తెలంగాణలోని బ్యాంకులకు తరలిస్తున్నట్లు నిర్థారించారు. డాక్యుమెంట్లు అన్నీ సరిగానే ఉండటంతో.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశాలతో డబ్బును యూనియన్ బ్యాంకుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News