Saturday, April 5, 2025

ట్రాక్టర్‌పై కూలిన తాటిచెట్టు

- Advertisement -
- Advertisement -
  • తృటిలో తప్పిన పెను ప్రమాదం

వైరా : ట్రాక్టర్‌పై తాటిచెట్టు పడి ట్రాక్టర్ డ్రైవర్‌కు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న సంఘటన మంగళవారం వైరా మండల పరిధిలోని గొల్లపూడి, గొల్లెనపాడు గ్రామాల మధ్య చోటుచేసుకుంది. గొల్లపూడి గ్రామం నుండి గొల్లెనపాడు గ్రామానికి ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్తున్న కందుల సత్యం అకస్మాత్తుగా తాటిచెట్టు పడటం గమనించి ట్రాక్టర్ వేగాన్ని తగ్గించటంతో తాటిచెట్టు ట్రాక్టర్ ఇంజన్‌పై పడింది.

సత్యం సమయస్ఫూర్తిగా ట్రాక్టర్ వేగాన్ని తగ్గించకపోతే అతడిపైనే పడి ఉండేదని ఈ సంఘటన చూసిన స్థానికులు అన్నారు. ఏది ఏమైనా ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు అనే సత్యం ఈ సంఘటన తీరు చూస్తే అర్ధమవుతుందని, డ్రైవింగ్‌లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News