Monday, December 23, 2024

నాలాలో కొట్టుకుపోయిన మహిళా స్వీపర్

- Advertisement -
- Advertisement -

గాంధీ ఆసుపత్రికి మృతదేహం తరలింపు
కేసు దర్యాప్తు చేస్తున్న వారాసిగూడ పోలీసులు

మన తెలంగాణ / సికింద్రాబాద్ : ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలో కొట్టుకుపోయి గుర్తు తెలియని మహిళ (50) మృతి చెందిన ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో అంబానగర్ దూద్‌బాయి నాలా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఓ మహిళ బ్రిడ్జి కింద నుంచి వెళ్లే క్రమంలో కాలు జారి నాలాలో పడిపోయింది. దూద్‌బాయి నుంచి అంబానగర్‌కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది.

విషయం తెలుసుకున్న వారాసిగూడ పోలీసులు అంబానగర్‌లో శవమై తేలిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతురాలు పూర్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ శంకర్ తెలిపారు. కాగా మృతురాలు కాంట్రాక్టు స్వీపర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సునీత, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని నాలాను పరిశీలించారు. ఘటన దురదృష్టకరమని ఆమె అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News