Thursday, January 23, 2025

సంస్కృతి ఉట్టిపడేలా చెరువుల పండుగను నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

కోహెడ: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు (గురువారం) చెరువుల పండుగను సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి కొక్కుల కీర్తి సురేష్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. తొలుత సమావేశంలో ఆయా శాఖల అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. అధికారుల పనితీరుపై.. సమస్యల పరిష్కారాలపై.. ఎంపిటిసిలు సర్పంచులు సభ దృష్టికి తీసుకోచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అన్ని గ్రామాల్లోని చెరువుల వద్ద చెరువుల పండుగ ఘనంగా నిర్వహించాలని, ఉత్సవాల్లో అందరినీ భాగస్వాములను చేసి విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరించాలని సూచించా రు. ఈ సమావేశంలో జడ్పిటిసి నాగరాజు శ్యామల మధుసూదన్ రావు, ఫ్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్రావు, వైస్ ఎంపిపి తడకల రాజిరెడ్డి, ఎంపిటిసిల ఫో రం మండల అధ్యక్షుడు జాగిరి కుమారస్వామి గౌడ్, తహశీల్దార్ జావిద్ అహ్మద్, ఎంపిఓ కే.సురేష్, ఆ యా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలున్నారు.
ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ఎంపిపి కీర్తి సురేష్
మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా వి చ్చేసిన ఎమ్మెల్యే సతీష్‌కు పుష్పగుచ్ఛం అందించి ఎం పిపి కొక్కుల కీర్తి సురేష్ ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News