Thursday, January 23, 2025

శివాజీనగర్‌లో ఒకరి హత్యకు దారి తీసిన ముగ్గు గొడవ

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: ఇంటి ముందు వే సిన ముగ్గు గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. సం ఘటనకు కారణమైన నల్గురు కుటుంబ సభ్యులపై పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ భోజ్యా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం… ఉప్పుగూడ శివాజీనగర్‌కు చెందిన అన్నారం వెంకటయ్య ప్లంబర్ పనిచేస్తుంటాడు. అ తని భార్య అన్నారం జయశ్రీ (61) మంగళవారం ఉదయం 8గంటల ప్రాంతంలో వాకిలి ఊడ్చి ముగ్గు వేసింది. కొద్ది సేపటి తరువాత వారి పక్కింటికి చెందిన మెకానిక్ దుర్గేష్ (30) కుటుంబం తమ ఇంటిని నీటితో శుభ్రం చేశారు. ఆ నీరు జయశ్రీ వేసిన ముగ్గుపై నుండి వెళ్ళింది. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం చోటు చేసుకుంది.

దురేష్, అతని తల్లి సుగుణ, సోదరి స్వాతి, తండ్రి ఆంజనేయులు కలిసి అకస్మాత్తుగా వెం కటయ్య కుమార్తె రాధపై దాడి చేస్తూ బూతులు తిట్టారు. కూతురు రాధ కే కలు విన్న తండ్రి వెంకటయ్య, కుమారుడు ఎ.మాణిక్ ప్రభు (35)లు ప రుగు పరుగున రాగా దుర్గేష్, అతని తండ్రి ఆంజనేయులు కలిసి మాణిక్ ప్రభు మెడను గట్టిగా పట్టుకొని తలను గొడకేసి బాదారు. సున్నితమైన భాగాలలో గట్టిగా తన్నారు. దీంతో మాణిక్ ప్రభు స్పృహ కోల్పోయాడు. బాధితుడిని ఉస్మానియాకు తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. గతంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన చిన్న గొ డవను మనస్సులో పెట్టుకొని తమ కుటుంబంపై ఉద్దేశ పూర్వకంగానే దా డి చేశారని బాధితుడి తండ్రి వెంకటయ్య పోలీసులకు తెలిపాడు. అతని ఫి ర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News