Friday, December 20, 2024

విజ్ఞాన జిజ్ఞాసను పెంచే సినిమా ఎగిసి పడే తారాజువ్వలు

- Advertisement -
- Advertisement -
  • మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా

గజ్వేల్: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచి వారిలో వి జ్ఞాన జిజ్ఞాసను కలిగించే స్పూర్తిదాయకమైన చిత్రం ఎగిసే తారాజువ్వలు అని స్థానిక మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా అన్నారు. గురువారం శిరిడి సాయి చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని సంతోష్ థియేటర్‌లో ఎగిసే తారాజువ్వలు అనే పిల్లల సినిమాను ప్రదర్శించారు. ప్రజ్ఞాపూర్ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఈ సినిమాను తిలకించిన మున్సిప ల్ ఛైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎంతో ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడే ఉపయోగకరమైన చిత్రాన్ని చిత్ర దర్శక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు అందించారన్నారు. వారిని ఆయన అభినందించారు. పిల్లలు మంచి విద్యతో పాటు ఉత్తమ పౌరులుగా ఎదగటానికి ఈ సినిమా స్పూర్తినిస్తుందని ఆయన ఆశాభావం వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దపలి జిల్లా కు చెందిన శిరిడి సాయి చిల్డ్రన్స్ ఫి లిం సొసైటీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ అల్లం వినోద్ కుమార్ రెడ్డి,గజ్వేల్ సబ్ డి స్ట్రిబ్యూటర్ బత్తని నరేష్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించి సన్మానం చేశా రు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ జకీయొద్దీన్,కౌన్సిలర్ బొగ్గుల చందు,బిఆర్‌ఎస్ నాయకులు ఎన్‌సి సంతోష్, కొమురవెల్లి ప్రవీణ్ కుమార్, శంకరయ్యతో పాటు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News