Tuesday, December 24, 2024

హరీశ్వర్‌రెడ్డికి అంతిమ వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : పరిగి మాజీ ఎంఎల్‌ఎ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఇటీవలే కోలుకుని పరిగిలో ఇంటివద్దే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి బోజనానంతరం ఇంట్లోనే కళ్లు తిరిగి కిందపడిపోయారు. కుటుంబీకులు సిపిఆర్ చేసినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించా రు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. హరీశ్వర్‌రెడ్డి 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికలలో పరిగి ఎంఎల్‌ఎగా విజయం సాధించారు. వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన హరీశ్వర్‌రెడ్డి పరిగి ఉపసర్పంన్‌గా, 1978లో సర్పంచ్‌గా, సమితి వైస్ చైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా సేవలు అందించారు. 1985 నుంచి 1987 వరకు ఆగ్రో ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా, 1987 నుంచి 1989 వరకు తితిదే సభ్యుడిగా వ్యవహరించారు. 1997 నుంచి 2000 సంవత్సరం వరకు ఆ ర్థిక సంస్థ చైర్మన్‌గా కొనసాగారు. 2012లో ఆయన బిఆర్‌ఎస్‌లో చేరారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య గిరిజారెడ్డి, ఇద్దరు కుమారులు మహేష్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, కుమార్తె అర్చనారెడ్డి ఉన్నారు. పెద్ద కుమారుడు కొప్పుల మహేశ్ రెడ్డి ప్ర స్తుతం పరిగి ఎంఎల్‌ఎగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు శనివారం హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఏర్పాటు చేశారు.
సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్
మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పరిగి నుంచి పలుమార్లు ఎంఎల్‌ఎగా గెలిచి, ప్రజాభిమానం పొందిన నాయకుడు హరీశ్వర్‌రెడ్డి అని సిఎం కొనియాడారు. ఆ యనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. హరీశ్వర్‌రెడ్డి కుమారుడు ప్రస్తుత పరిగి ఎంఎల్‌ఎ మహేశ్‌రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
హరీశ్వర్ రెడ్డి భౌతిక కాయానికి మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు నివాళులు
ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో శాసన సభ మాజీ డిప్యూటీ స్పీక ర్, పరిగి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు స్వర్గీయ హరీశ్వర్‌రెడ్డి భౌతిక కాయానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు నివాళులు అ ర్పించారు. పరిగిలో హరీశ్వర్‌రెడ్డి నివాసంలో ప్రస్తుత పరిగి ఎంఎల్‌ఎ మహేశ్వర్ రెడ్డిని ఓదార్చారు. ఇతర కు టుంబ సభ్యులను మంత్రులు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రుల వెంట చేవెళ్ల ఎంఎల్‌ఎ యాదయ్య, ఇబ్రహీంపట్నం ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ తీగల కృష్ణారెడ్డి, స్థానిక నా యకులు ఉన్నారు. అలాగే హరీశ్వర్‌రెడ్డి పార్ధివ దేహానికి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నివాళులు అర్పించారు.
నివాళులర్పించిన మంత్రి సబిత
మాజీ డిప్యూటీ స్పీకర్, పరిగి మాజీ ఎంఎల్‌ఎ కొప్పుల హరీశ్వర్ రెడ్డి భౌతిక కాయానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ హ రీశ్వర్‌రెడ్డి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అ ర్పించారు. హరీశ్వర్‌రెడ్డి మృతిపై ఎర్రబెల్లి దయాకర్‌రా వు, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
హరీశ్వర్‌రెడ్డి మృతదేహానికి అధికారిక లాంఛనాలతో ని ర్వహించారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఇంట్లో నుంచి భౌతికాయాన్ని తీశారు. బహార్‌పేట్ నుంచి బొడ్రాయి వయా స్వామి వివేకనంద స్వామి విగ్రహం వరకు అక్కడి నుంచి నేషనల్ హైవే మీదుగా కోడంగల్ చౌరస్తా నుంచి షాద్‌నగర్ రూట్‌లో ఉన్న పల్లవి డిగ్రీ క ళాశాల ఆవరణ వరకు భారీగా శవ యాత్ర నిర్వహించా రు. అనంతరం డిఎస్సీ కరుణ సాగర్‌రెడ్డి. సిఐ వెంక ట్రా మయ్యల ఆధ్వర్యంలో పోలీస్‌లు అభిమానుల మధ్య అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనంగా గాలిలోకి పో లీ స్‌లు కాల్పుల రౌండ్లు జరిపి నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News