Thursday, January 23, 2025

కారులో చలరేగిన మంటలు

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : కారులో మంటలు చెలరేగి తుదిలో ప్రాణాపాయం తప్పిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం కొత్తగూడెంకు చెందిన ఎగి రాజు అనే వ్యక్తి కార్లో సత్తుపల్లిలోని వెంచర్ రోడ్డులో గల హోటల్‌కు వచ్చారు. భోజనం అనంతరం తిరిగి వెళుతుండగా కారు ఇంజన్ భాగం నుంచి పంటలు వచ్చాయి.

దీన్ని గమనించని స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2.90 లక్షలు నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News