Monday, December 23, 2024

చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లోని ఓ చె ప్పుల దుకాణంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగి దుకాణం పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్లితే… బాలాజీనగర్ ప్రధాన రహదారిపై అమిల్‌పూర్ సుధాకర్ (43) అనే వ్యక్తి గత 20 సంవత్సరాలుగా రామా ఫుట్‌వేర్ పేరుతో చెప్పుల దుకాణం నడిపిస్తున్నాడు. బుధవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్లగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో షాప్‌లో నుంచి మంటలు వస్తున్నట్లు సమీపంలోని మొబైల్‌షాప్ నడిపే నగేష్ అనే వ్యక్తి గమనించి సుధాకర్‌కు సమాచారం ఇచ్చాడు.

అతను వచ్చి చూడగా షాప్ పూర్తిగా మంటలో కాలిపోవడం చూసి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు ఫైర్‌ఇంజన్ సహాయంతో మంటలు ఆర్పినప్పటికి అప్పటికే షాపు పూర్తిగా దగ్ధం అయ్యింది. దాదాపు 4 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు అమిల్‌పూర్ సుధాకర్ వాపోయాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు. ఈ మేరకు జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News