Friday, December 27, 2024

ప్రేమ పెట్టిన అగ్గి.. నాలుగు ఇళ్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: ఓ ప్రేమ వివాహం పెట్టిన అగ్గి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఆ గ్రామంలో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు. స్థానికుల కథనం ప్రకారం… నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామ సర్పంచ్ మండల రవీందర్ కూతురు హన్మకొండ హసన్‌పర్తిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతుంది. కాగా ఇదే గ్రామానికి చెందిన జలగం రంజీత్‌లు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కాగా రంజీత్ నర్సంపేట పట్టణం సర్వాపురంలోని ఓ బ్యాంకు ఏటీఎం వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

వీరిద్దరు ఐదు రోజుల నుంచి కనిపించకపోవడంతో కావ్యశ్రీ తండ్రి రవీందర్ హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీస్‌స్టేషన్‌కు రంజీత్, కావ్యశ్రీలు చేరుకొని ఇరువురి పెద్దల సమక్షంలో తాను రంజీత్‌ను పెళ్లి చేసుకున్నాను. మీతో రాను అని కావ్యశ్రీ వారి తల్లిదండ్రులతో చెప్పింది. దీంతో చేసేదేమి లేక కావ్యశ్రీ తల్లిదండ్రులు, బంధువులు ఇంటికి చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు జలగం రంజీత్, వీరి ప్రేమకు సహకరించిన మరో ముగ్గురి ఇళ్లను దగ్ధం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విషయం తెలుసుకున్న నర్సంపేట సీఐ పులి రమేశ్‌గౌడ్, ఎస్సై బొజ్జ రవీందర్‌లు గ్రామానికి చేరుకొని కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుకోకుండా ఉండేందుకు గాను పోలీసులు భారీగా పికెటింగ్ ఏర్పాటుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News