Saturday, January 11, 2025

చేపల వేటకు వెళ్లి మత్సకారుడి మృతి

- Advertisement -
- Advertisement -

హాజీపూర్: మండలంలోని గుడిపేట గ్రామానికి చెందిన మత్సకారుడు కంకణాల భూమయ్య (62) మంగళవారం ఉదయం ఎల్లంపల్లి ప్రాజెక్టులోని బ్యాక్ వాటర్‌లో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందినట్లు ఎస్సై నరేష్‌కుమార్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో చేపట్టడానికి వెళ్లి నీటిలోపల తెప్ప మీద వెళ్తూ చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు తెప్ప పైనుండి నీటిలో పడ్డాడు.

అక్కడే ఉన్న మత్సకారులు తమకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వెళ్లి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం మృతదేహం లభ్యమైందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుని పెద్ద కుమారుడు రా యమల్లు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి బార్య, ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News