Thursday, December 19, 2024

రోడ్డు ప్రమాదంలో మత్స్యకారుడి మృతి

- Advertisement -
- Advertisement -

హత్నూర: చేపల వేట కోసం వెళ్లుతూ రోడ్డు ప్రమాదంలో మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండల శివారులో చోటుచేసుకుంది. కుటుంబీకులు, పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం హత్నూర గ్రామానికి చెందిన గుడాల భానుచందర్ (37) శనివారం గ్రామ శివారులోని నడిమి చెరువు సమీపంలో గల తన పొలానికి వెళ్లి అక్కడే ఉన్న చెరువులో చేపల వేటకు వెళ్తానని కుటుంబ సభ్యులకు చెప్పి తన ట్రాక్టర్‌పై వెళ్ళాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మహేశ్వరి ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు. ఫొటోడి భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News