న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులు కొన్ని పదాలను ఉపయోగించకూడదని ఇటీవల విడుదల చేసిన పార్లమెంట్ బులెటిన్‌పై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పార్లమెంటు భవనం ఆవరణలో “ప్రదర్శన, ధర్నా, సమ్మె, ఉపవాసం లేదా ఏదైనా మతపరమైన వేడుకను నిర్వహించ కూడదన్న నియమంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకుడు ట్విట్టర్‌లో నోటీసును పంచుకున్నారు. దానిపై టిఎంసి ఎంపి డెరెక్ ఓబ్రెయిన్ కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు. విషగురు తాజా నిబంధన(సాల్వో) ‘ధర్నా మనా హై’ అంటూ కాంగ్రెస్ ఎంపీ తన పోస్ట్ లో రాశారు. ‘‘నిరసన తెలుపేందుకు ప్రదర్శనలు, ధర్నాలు, సమ్మెలు, నిరాహార దీక్షలు చేయడం పార్లమెంటు టాక్టిస్లు(విధానాలు). ఆ విషయంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు’’ అని రాసుకొచ్చారు. దానికి టిఎంసి ఎంపీ ప్రతిస్పందించి ఇలా అడిగారు, ‘‘నాకు అప్ డేట్ ఇస్తారా? ఎవరూ మతపరమైన వేడుకలు చేసుకోలేదా?’’ అంటూ ప్రశ్నించారు. పార్లమెంటు మాన్సూన్ సమావేశాల్లో కొన్ని పదాలను వాడినా వాటిని అన్ పార్లమెంటరీగా భావించి సభ్యులను పార్లమెంటు నుంచి బయటికి పంపించేస్తారు. హిందీలో సామాన్యంగా వాడే పదాలు… గద్దార్, గిర్గుట్, చంచా, చంచాగిరి, చేలాస్, ఘడియాలీ ఆన్సూ, అప్మాన్, అసత్య, అహంకార్, కరప్ట్, కాలా దిన్, కాలా బాజారీ, ఖరీద్ ఫరోక్త్ వంటి పదాలను కూడా అన్ పార్లమెంటరీ పదాల జాబితాలో చేర్చారు.
“ఎంపీలపై గ్యాగ్ ఆర్డర్ జారీ చేయబడింది. ఇప్పుడు పార్లమెంటులో ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ ప్రాథమిక పదాలను ఉపయోగించడానికి మాకు అనుమతి లేదు, అందుకు సిగ్గుపడుతున్నాను. ‘అవినీతిపరుడు. వంచన. అసమర్థత’ వంటి పదాలను నేను ఉపయోగిస్తాను. నన్ను సస్పెండ్ చేయండి. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాను” అని టీఎంసీ నేత ట్వీట్ చేశారు. ఇదిలావుండగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం మాట్లాడుతూ, ‘‘ఉభయ సభల్లో ఎలాంటి పదాలను ఉపయోగించకుండా నిషేధించలేదు’’ అన్నారు.