Monday, December 23, 2024

పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలే కాపాడుకుంటారు

- Advertisement -
- Advertisement -

విపక్షాల మాయమాటలను నమ్మి మోసపోవద్దు

50 అధికారంలో ఉన్నోళ్లు ఓట్ల కోసం వస్తే నిలదీయండి

ఎన్నికల్లో ఇకముందు కూడా డబ్బు, మద్యం పంచను కులం, మతం పిచ్చితో పనిచేయను

మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా.. లేదంటే ఇంట్లో ఉంటా

సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలు

600 మంది చేతివృత్తిదారులకు రూ.లక్ష సాయం పంపిణీ

మన తెలంగాణ/సిరిసిల్ల: ‘ఎన్నికల్లో ఏనాడూ డబ్బు, పంచలేదు. ఇకముందు కూడా సిరిసిల్ల ప్రజలకు సేవ చేస్తా. ఇప్పటికే నాలుగు సార్లు సిరిసిల్ల నుంచి గెలిచా. మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా.. లేదంటే ఇంట్లో ఉంటా. అంతేకాని కులం, మతం పిచ్చితో పని చేయను. పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకులను ప్రజలే కాపాడుకోవాలి’ అనిమంత్రి కెటిఆర్ ప్రజలను కోరారు. మంగళవారం సిరిసిల్ల జి ల్లా కలెక్టర్ కార్యాలయంలో బిసి, ఎబిసి కులాలవారికి లక్ష రూపాయల గ్రాంట్ పంపిణీ పథకంలో భాగంగా ఎంపిక చేసిన 600 మందికి చెక్కులు అందించిన సందర్భంగా మంత్రి మా ట్లాడారు. సమయం దగ్గర పడుతున్న వేళ ప్రతిపక్ష పార్టీల వారు ఎన్నో మాటలు చె బుతారని, వాటికి మోసపోవద్దన్నారు. 50ఏళ్లు అధికారంలో ఉండి, పరిపాలన చేసిన పార్టీలో ఉన్న నాయకులు ప్రజలకు ఏం చేశారని నిలదీయాలన్నారు. ఎన్నికల సమయంలో మందు, డబ్బు వెదజల్లుతారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనసున్న సిఎం కెసిఆర్ పాలనలో అందరికీ అన్ని పథకాలు అం దుతాయని అందరికి ఒకేసారి సాధ్య పడకపోవచ్చునని, వెనకముందు అందరికీ ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇండ్లకు గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు అందుతాయన్నారు.

వేములవాడలో 42 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంచామని, మరో 800 మందికి ఇండ్ల పట్టాలు త్వరలోనే ఇస్తామన్నారు. తాము బిసి, ఓబిసి కులాల వృత్తుల వారికి లోన్లుగా కాకుండా మళ్లీ తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా గ్రాంట్‌గా లక్ష రూపాయలు ఇస్తున్నామని వీటిని మీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలన్నారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిని ప్రజలు నిలదీయాలన్నారు. ప్రజలు చైతన్య వంతులు కావాలని పిలునిచ్చారు.అధికారంలో ఉన్నన్ని రోజులు ఎందుకు అభివృద్ధి పనులు చేయలేదని నిలదీయాలన్నారు. అన్ని అభివృద్ధి పనులు సిరిసిల్లకే చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారని నవ్వుకుంటూ అన్నారు. స్వపక్షంలోని వారు కొన్ని అభివృద్ధి పనులు రహస్యంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి సిపి అరుణ, ఎంఎల్‌ఎ రమేశ్‌బాబు, పవర్‌లూమ్ టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎంసిపిలు జిందం కళచక్రపాణి, రామతీర్థపు మాధవి, కలెక్టర్ అనురాగ్ జయంతి, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News