Sunday, December 22, 2024

సెల్‌ఫోన్లు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ : ఒక్క ముఠాగా ఏర్పడి ఆ టో లో ప్రయాణికులుగా నటిస్తు ప్రయాణికుల వద్ద నుంచి సెల్‌పోన్లను తస్కరిస్తున్న ముఠాను ఆదుపులోకి తీసుకొని ఆటోతో పా టు 6లక్షల విలువైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఉదయం బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో బేగంపేట్ ఏసిపి రామలింగరాజు బోయిన్‌పల్లి సిఐ ల క్ష్మీనారాయణరెడ్డి, విస్లావత్ సదర్ నాయక్‌లతో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ… పాతబస్తీకి చెందిన మహ్మద్‌ఎజాజ్, మహ్మద్ అలియాస్ మోడల్ ,వసీం, సయ్యద్ సాజీద్, మహ్మద్ అమీర్ లు ముఠాగా ఏర్పడి ఆటోను ఏర్పాటు చేసుకొని ప్రయాణికుల ను ఎక్కించుకొని వారి వద్ద నుంచి సెల్‌ఫోన్ల్‌ను తస్కరిస్తున్నార ని పేర్కోన్నారు. నిందితుడు సయ్యద్ సాజీద్‌పై నగరంలోని ప లు పోలీస్ స్టేషన్లో 15 కేసులు నమోదయ్యాయని మహ్మద్ అ మీర్‌పై ఒక మర్డర్ కేస్ సైతం ఉందని తెలిపారు. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్ ప్రాంతానికి చెందిన దేవేందర్‌శర్మ (32) బోయిన్‌పల్లి బ స్‌స్టాప్‌లో కొంపల్లి వెళ్లటానికి ఆటోలో ఎక్కాడు.

అప్పటికే అం దులో ప్రయాణికులగా ఉన్న ముఠా సభ్యులు దేవేందర్‌శర్మను మద్యలో కూర్పోబెట్టి అతని సెల్‌ఫోన్‌ను తస్కరించారు. దీంతో కొద్దిసేపటికి అతను తన సెల్‌ఫోన్‌ను చూసుకోవటంతో అది క నిపించలేదు. దీంతో పక్కనే ప్రయాణికులుగా నటిస్తున్నవారిని ఆడగగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. దీంతో బాధితుడు బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు.

కే సు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా సిసిటివిపుటేజీలను పరిశీలించి ఆటోతో పాటు 19 సెల్‌ఫోన్లు ఇద్దరు నిందితులతో పాటు తస్కరించిన సెల్‌ఫోన్లను ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్న మహ్మద్ ఆహ్మద్, మహ్మద్ షఫీలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించా రు. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని వారిని సైతం త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కోన్నారు. చాకచాక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేసినందుకుగా ను నార్త్‌జోన్ డిసిపి చందన దీప్తి, అడిషన ల్ డిసిసి మధుసూధన్‌రావులు అభినందించారు. ప్రజలు ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News