Monday, December 23, 2024

గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ఓడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న గంజాయి ముఠాను పట్టుకుని నలుగురు నిందితులను రిమాండ్ చేశామని నల్లగొండ డీఎస్పీ నర్సింహ్మారెడ్డి తెలిపారు. నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఆయన నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రానికి చెందిన సిసా ఉర్దబ్, కిల్లా జగత్రేయ్, కర్ణ మధుకమి, మాస కొభాసి అనే నలుగురు ఈ నెల 7వ తేదీన 15కేజీల గంజాయి ప్యాకెట్లను హైదరాబాద్‌కు తరలిస్తుండగా 65వ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు కేతేపల్లి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వారు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పట్టుకున్నారు.

నలుగురు వ్యక్తులను విచారించగా వారి వద్ద 15కేజీల గంజాయి ప్యాకెట్లు దొరికాయని వాటి విలువ సుమారు 3లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసి వారిని ఆదివారం నకిరేకల్ జూనియర్ మున్సిబ్‌కోర్టులో హాజరుపర్చగా వారిని రిమాండ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు చేధించిన శాలిగౌరారం సీఐ రాఘవరావు, కేతేపల్లి ఎస్సై బి శ్రీకాంత్‌గౌడ్, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News